ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొనసాగు తున్న ఉద్యమం స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్. ఉద్యమంలో ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేశారు. వారి త్యాగం వృధా కానివ్వం. డిసెంబర్ 31 తరువాత తెలంగాణకు అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక లేకపోతే ఉద్య మాన్ని ఉదృతం చేస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు పేర్కొన్నారు.
తెలంగాణలో అపారమైన వనరులు ఉన్నాయని అయిన ఈ ప్రాంతం అభి వృద్దికి నోచుకోవడం లేదని అన్నారు. వనరులు ఇక్క డ ఉన్న అభివృద్ది మాత్రం ఆంధ్రా ప్రాంతంలో జరు గుతుందని అన్నారు. మన వనరులను, ఉద్యోగ ఉ పాధిని మనమే ఉపయోగించుకొని తెలంగాణ ప్రాం తాన్ని అభివృద్ది చేసుకోవాలని కోరారు. జై తెలంగాణ అంటే దోస్తి చేస్తాం..నై తెలంగాణ అంటే తరిమి కొడ తామని హెచ్చరించారు.