8, నవంబర్ 2010, సోమవారం

ఖేల్ రత్నా అవార్డును అందుకున్న సైనా నెహ్వాల్!

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఖేల్ రత్నా అవార్డును అందుకున్నారు. ప్యారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన కారణంగా ఆగస్టు 29వ తేదీ జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సైనా నెహ్వాల్‌ పాల్గొనలేకపోయింది.

తద్వారా సోమవారం సైనా నెహ్వాల్‌కు రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా అవార్డును కేంద్ర క్రీడా శాఖా మంత్రి ఎం.ఎస్. గిల్ అందజేశారు. ఖేల్ రత్న పతకంతో పాటు రూ. 7.5లక్షల నగదును కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్‌కు గిల్ అందజేశారు.