సద్గురు సంగీత సభ పదిహేడవ వార్షిక సంగీత మహోత్సవాలు ఈనెల తొమ్మిదవ తేదీ నుండి 13 వ తేదీ వరకు నిర్వహింపబడతాయని సంస్థ కార్యదర్శి పోపూరి గౌరినాథ్ తెలిపారు.
విజయవాడ ఘంటశాల వెంకటేశ్వరరావు సంగీత,నృత్య కళాశాల ప్రాంగణంలో కార్యక్రమాలు జరుపనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు సాయంత్రం విశేషమైన సంగీత కచేరీలు నిర్వహింపబడతాయని అన్నారు.
ఈ మహోత్సవాలలో భాగంగా సంగీత రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి ఏటా ఇచ్చే సంగీత విద్వన్మణి బిరుదును ప్రియా సిస్టర్స్‌గా ప్రసిద్ధులైన షణ్ముఖప్రియ, హరిప్రియలకు అందచుయబడతాయని తెలిపారు.