కాంగ్రెస్ ఎంపీలు చేతకాని దద్దమ్మలని, వారికి సోనియా భజన తప్ప వారికేమీ తెలియదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు విమర్శించారు. తమ హక్కులకోసం పోరాటం చేయలేని ఎంపీలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తే రైతులకు లాభం చేకూరుతుందని బాబు అభిప్రాయపడ్డారు. గుంటూరులో హైకోర్టు బెంచ్ కోరుతున్న న్యాయవాదుల డిమాండ్ సరైందేనని బాబు అన్నారు.