రాజకీయాలు, సినిమాలు తనకు రెండు కళ్లలాంటవని పీఆర్‌పీ అధినేత చిరంజీవి అన్నారు. ఇక మీద నెలలో 10 రోజులు సినిమా షూటింగులకు కేటాయిస్తానని చిరంజీవి అన్నారు. ఫ్రిబ్రవరిలో తన కొత్త సినిమా ప్రారంభమయ్యే అవకాశముందని, దర్శకుడు ఇంకా ఖరారు కాలేదని ఆయన వివరించారు. ప్రస్తుతం బన్నీ పెళ్లి పనుల్లో నిమగ్నమయినందువల్ల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నానని చిరు తెలిపారు.