ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన చైనా.. జనగణనకు శ్రీకారం చుట్టింది. దాదాపు 65 లక్షల మంది సిబ్బందితో చేపట్టిన ఈ భారీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. విడతల వారీగా జనాభా లెక్కలను పూర్తి చేసి 2011 ఏప్రిల్ చివరి నాటికి తుది జాబితాను ప్రకటించేలా ప్రణాళికను రూపొందించింది. పూర్తి వివరాలు సేకరించేలా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్(ఎన్‌బీఎస్) 18 ప్రశ్నలతో ఒక సమాచార సేకరణ పత్రం, 45 ప్రశ్నలతో మరో పత్రాన్ని రూపొందించింది.
సోమవారం(నవంబర్ 1) నాటికి జన్మించిన వారితో సహా అందరి వివరాలను సేకరించనున్నారు. అలాగే సోమవారం తర్వాత జన్మించే వారి వివరాలు 2020లో చేపట్టే జనగణనలోనే నమోదవుతాయి. ప్రస్తుతం చేపట్టిన ఈ భారీ కార్యక్రమానికి 10 కోట్ల 30 లక్షల అమెరికన్ డాలర్ల వ్యయం కానుంది.
news from andhajyoti