భారతీయ సినీ పరిశ్రమలో తనదైన కెమెరా పనితనంతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ పోలాండ్‌లో జరిగే చలనచిత్రోత్సవం సందర్భంగా నిర్వహించే సినిమాటోగ్రఫీ పోటీలకు ఎంపికయ్యారు. ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ఈ పోటీకి భారత్ నుంచి తాను ఎంపిక కావడం పట్ల రవి కె.చంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈనెల 27వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు పోలాండ్ దేశంలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన రవి కె.చంద్రన్ ప్రస్తుతం తమిళంలో '7ఆమ్ అరివు', హిందీలో 'అగ్నిపథ్' చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు.
news from andhajyoti