2, నవంబర్ 2010, మంగళవారం

‘పశ్చిమ’లో బాబు పర్యటన వాయిదా?


ఈశాన్య రుతు పవనాలు సైతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. హోరున పడుతున్న వర్షాలు బాబు ‘పశ్చిమ’ పర్యటన దిశను మార్చేసేలా ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవానికి గత నెల 27,28,29 తేదీల్లో చంద్రబాబు పర్యటించాల్సి ఉంది.. ఇప్పటికే ఒకమారు వర్షాల కారణంగా బాబు పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆయన పర్యటన షెడ్యూల్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. మరోమారు ఆయన పర్యటనలో మార్పు లు చేసేలా సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం..

‘పశ్చిమ’లో చంద్రబాబు పర్యటించి వరి, ఆక్వా రైతులను పరామర్శిస్తే బాగుంటుందని నేతలు భావిస్తున్నారు. మిగిలిన రెండు రోజుల్లో మెట్ట ఏజెన్సీల్లోని పొగాకు, మొ క్కజొన్న, వరి, తదితర పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేలా షెడ్యూల్‌లో మార్పు చేసేలా పార్టీ నేతలు భావిస్తున్నారు.