2, నవంబర్ 2010, మంగళవారం

కల్తీ కక్కుర్తి... ప్రజారోగ్యం గాలికి......


డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో ఆహార పదార్థాలు, నిత్యావసరా లు కల్తీ అవుతున్నాయి. వినియోగదారుల అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు కక్కుర్తికి పాల్పడుతున్నారు. నిత్యావసరాలైన పప్పులు, మంచినూనె, కారం, టీపొడి వంటి పలు సరుకులు కల్తీ అవుతున్నాయి. హోటళ్లలో నాణ్యత పాటించకపోవడంతో కొద్ది రోజులు క్రమం తప్పకుండా హోటల్‌లో భోం చేసిన వారు మంచం పట్టక తప్పడం లేదు. హోటళ్లలో నాణ్యమైన సరుకులు వాడకపోవడంతో వినియోగదారులు వ్యాధుల భారిన ప డుతున్నారు. కల్తీ లేకుండా నియంత్రించాల్సిన ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు చో ద్యం చూస్తున్నారు.

ప్రజారోగ్యాన్ని అధికారులు గాలికొదిలేస్తున్నా రు. మామూళ్ల మత్తులో పడి తనిఖీల ఊసే మ రచిపోయారు. హోటళ్లు,రెస్టారెంట్లు,దాబాలు, కిరాణం షాపులు, స్వీట్‌హోంలు, ఆహార పదార్థాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల నుంచి వా రివారి స్థాయిని బట్టి కొందరు అధికారులు, సి బ్బంది మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. చిన్న, చిన్న కిరాణం షాపులను కూడా వదలడం లేదనే విమర్శలున్నాయి. శ్యాంపిళ్ల సేకరణలో ఈ శాఖ అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నార, మామూళ్లు ఇచ్చిన వారి జోలికి అసలు వెళ్లడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

ఒకవేళ వెళ్లినా శ్యాంపిళ్ల సేకరణలోనే జాగ్రత్త పడుతున్నారు. ఏటా తమకున్న లక్ష్యా లను చేరుకునేందుకు శ్యాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లకు పంపి కల్తీలే లేవని చేతులు దులుపుకుంటున్నారు. హాటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ప్రోవిజనల్ స్టోర్లు, కిరాణం షాపులు, ఆహార పదార్థాల తయారీ ఫ్యాక్టరీల నుంచి ప్రతినెలా ఆహార పదార్థాలు, సరుకుల శ్యాంపిళ్లను సేకరించి, పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌లోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపాలి.

ఆ ల్యాబ్‌లో పదార్థాలు కల్తీ అని తేలితే సంబంధిత సంస్థల వ్య క్తులపై ఆహార కల్తీ నివారణ చట్టం (1954) ప్ర కారం కేసులు నమోదు చేయాలి. కొన్ని సంవత్సరాలుగా ఈ శాఖ అధికారులు నమోదు చేసిన నామమాత్ర కేసులను పరిశీలిస్తే ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది.