2, నవంబర్ 2010, మంగళవారం

తెలంగాణను ప్రకటిస్తే మన్యసీమ ఇవ్వాల్సిందే..


తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే మన్యసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని మన్యసీమ సాధన సమితి కో- కన్వీనర్ మాలువ సింహా చలం డిమాండ్ చేశారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు పూర్తయినా రాష్ట్రంలోని ఆదివాసీల స్థితిగతులు మెరుగుపడలేదన్నారు. ఆదివాసీల కోసం కేంద్రం జారీ చేసిన 1/70, పీసా చట్టాలు, జీఓ నంబర్ 3, 73, 5వ షెడ్యూల్ అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఇక ఆరవ షెడ్యూల్ అమలు చేయాలని కోరితే దీన్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గిరిజ నుల సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టిం చుకోవడం లేదన్నారు. ఈ పరిస్థితిలో తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లా వరకు గల 10 ఐటీడీఏ ప్రాంతాలను కలుసుకుని ప్రత్యేక మన్యసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.