డిసెంబర్ తర్వాత శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ పదవులకు రాజీనామా చేస్తారా లేక రాజీపడి సీమాంధ్రులకు తొత్తులుగా ఉంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ బిడ్డలుగా పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని, సీమాంధ్రుల మోచేతి నీల్లు తాగుతూ పదవులనంటి పెట్టుకుని ఉండొద్దని హితవు పలికారు. తెలంగాణకు ద్రోహం చేసేవారికి నాగం జనార్దన్‌రెడ్డికి పట్టిన గతే పడుతుందన్నారు.