26, ఫిబ్రవరి 2011, శనివారం

మార్చి 10న 'మిలీనియం మార్చ్‌ టు హైదరాబాద్‌'

మార్చి 10న 'మిలీనియం మార్చ్‌ టు హైదరాబాద్‌' పేరుతో పది లక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు హెచ్చరించారు. హైదరాబాద్ రోడ్లపైనే వంటావార్పు చేస్తామన్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ లెక్చరర్లకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామని, వారిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందన్నారు. 

తెలంగాణా ఏర్పాటు సాగే వరకు ఉద్యోగుల సహాయ నిరాకరణ ఆగబోదని.. అందుకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు తెలంగాణా ప్రజలంతా అందించేందుకు సిద్దంగా ఉన్నారని భరోసా ఇచ్చారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగులకు స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.