26, ఫిబ్రవరి 2011, శనివారం

గవర్నర్ వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తా

తెలంగాణపై గవర్నర్ నరసింహన్ కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని, గవర్నర్ తన వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని..కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు తమ పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులు జెసి దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి సమైక్యవాదాన్ని తెర మీదికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. 

ఉద్యమంలో పాల్గొనాలని కోరడం వేరు, వారిని లక్ష్యం చేసుకోవడం వేరని..తెలంగాణ జెఎసి తమ పార్టీ శాసనసభ్యులను లక్ష్యం చేసుకోవద్దని.. సీమాంధ్ర నేతలు తెలంగాణను వ్యతిరేకిస్తే తీవ్ర పరిణామాలుంటాయని, సీమాంధ్ర నాయకులు సమైక్యవాద నిర్ణయాన్ని వదిలేసి జై ఆంధ్ర నినాదాన్ని ముందుకు తేవాలని ఆయన కోరారు.