26, ఫిబ్రవరి 2011, శనివారం

జీతాలు ఇవ్వకపోతే ఊరుకునేది లేదు

కాంగ్రెస్, జగన్‌తో టీఆర్‌ఎస్ కుమ్మక్కు అయినట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అర్థం లేని విమర్శలు చేస్తున్నదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబునాయుడే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని చెప్పిన టీడీపీ, కాంగ్రెస్‌లు ఇప్పుడు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయన్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు చేసిన మోసానికి పశ్చాతాపపడి అప్రూవర్‌గా మారితే ప్రజలు క్షమిస్తారన్నారు. సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.