26, ఫిబ్రవరి 2011, శనివారం

సునీల్‌ పుట్టిన రోజు ఫిబ్రవరి 28.

కొందరికి తొలి ప్రయత్నమే ఘనవిజయం తీసుకొచ్చి, రెండుమూడు విజయాలు వరసగా వచ్చి, కిక్కిచ్చేయడంతో అహం పెరిగి అది డీలా పడేట్టు చేస్తుంది. కొందరికి రెండు మూడు ప్రయత్నాలు చేసినా పని జరగక నిరాశ నిస్పృహలకు గురిచేసి ప్రాప్తం లేదు కలిసిరాదు అనే వేదాంత ధోరణితో ఏర్పరుచుకుని ఏ ప్రయత్నాలూ చేయరు. కొందరికి తొలి ప్రయత్నం ఫెయిల్‌ అయినా నిరుత్సాహం రాక పోవడంతో మరి ప్రయత్నం సక్సెస్‌ అవుతుంది. అలాటి వారిలో సునీల్‌ ఒకరు.

డ్యాన్సులమీద దృష్టి పెడితే, నాటకం మీద దృష్టి పెడితే కలిసిరాలేదు. తరువాత డ్యాన్స్‌ పోటీల్లో వరసగా గెలుపొందారు. హైదరాబాద్‌ వచ్చి డ్యాన్స్‌ స్కూల్లో కొంతకాలం డ్యాన్సు ప్రాక్టీసు చేసారు. అలాగే సినిమా చాన్సులకోసం ప్రయత్నిస్తే 'సెకండ్‌ హాండ్‌' చిత్రంలో చాన్స్‌ వచ్చాక ఆ సినిమా ఆగిపోయింది. భీమవరం పరిసర ప్రజల ఇష్టదైవమైన మావుళ్ళమ్మ భక్తుడుగా ఆమె అనుగ్రహంచి చిరునవ్వు నవ్వగా 'చిరునవ్వు' చిత్రం వచ్చింది. ఆ తరువాత 'నువ్వే కావాలి'లో నటించారు. 'నువ్వే కావాలి' ముందు విడుదల కావడంతో గుర్తింపు వచ్చింది. వరసగా ఆరు చిత్రాలు హిట్‌ కావడంతో హాస్యనటుడుగా స్థిరపడిపోయారు. తన పెర్సనాల్టిdకి విలన్‌ పాత్రలు వస్తాయని అనుకుంటే కామెడీ వేషాలు వచ్చి కామెడీ ఆర్టిస్ట్‌ అయిపోయారు.

డ్యాన్సులు తెలిసి బాగా చేయగలిగే కామెడీ ఆర్టిస్ట్‌ సునీల్‌- అని రామ్‌గోపాల్‌ వర్మ నుంచి ప్రశంసలు పొందారు. అందాల రాముడులో హీరో అయిన సునీల్‌ని రాజమౌళి 'మర్యాద రామన్న' గా చూపారు. రెండూ హిట్‌ కావడంతో వర్మ దృష్టిలో పడి 'కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు' చిత్రంలో దర్శకుడు అయ్యారు. హీరోగా ఒక చిత్రానికి మరో చిత్రానికి వచ్చిన గ్యాప్‌లో కామెడీ ఆర్టిస్ట్‌ గానే కొనసాగుతున్నా, హీరోగానే చేస్తాడట ఇక కామెడీ పాత్రలకు ఫుల్‌స్టాప్‌ అనే వదంతులూ వ్యాపించాయి. సునీల్‌ పుట్టిన రోజు ఫిబ్రవరి 28.