26, ఫిబ్రవరి 2011, శనివారం

ఇద్దరూ డాక్టర్ల యాక్షన్‌ సినిమా

ఒకరు ఒరిజినల్‌ డాక్టర్‌ మరొకరు డాక్టరేట్‌ పురస్కార గ్రహీత. ఇప్పుడు వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. డా.రాజశేఖర్‌, డా.శ్రీహరి కాంబినేషన్‌లో సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇద్దరూ హీరోలుగానా లేక ఇద్దరిలో ఒకరిది ప్రత్యేక పాత్ర అనే విషయాన్ని దర్శక, నిర్మాతలు త్వరలో ప్రకటిస్తారు. యాక్షన్‌ చిత్రాలు తీయడంలో తనకంటూ ప్రత్యేకత కలిగిన కె.ఎస్‌.నాగేశ్వరరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని తెలిసింది. దీనిని వస్త్ర వ్యాపారి నాగభూషణం నిర్మిస్తారని సమాచారం. శ్రీహరి హీరోగా నిలబడడానికి కె.ఎస్‌. నాగేశ్వరరావు ఎంతగానో తోడ్పాటు అందించారు. శ్రీహరి హీరోగా ప్రారంభంలో వచ్చిన మూడు సినిమాలు పోలీస్‌, దేవా, సాంబయ్య వీటికి ఆయనే దర్శకుడనే విషయం తెలిసిందే.