26, ఫిబ్రవరి 2011, శనివారం

ఆమ్‌..ఆద్మీ..ఔర్‌..అమ్మో!

ప్రజలు అంటున్నది, మీడియా మొత్తుకుంటున్నది నిజమేనని ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారంనాడు లోకసేభకు సమర్పించిన 2011-12 ఆర్థిక సంవత్సరపు ఆర్థికసర్వే స్పష్టం చేసింది. మంత్రిగారు సమర్పించిన నివేదిక ప్రకారం

ఆర్థిక ప్రగతి మందగించింది

ద్రవ్యోల్బణం పెరిగిపోయింది

ఆహార ద్రవ్యోల్బణ విలయం

ద్రవ్య సరఫరా, వినిమయం వల్ల విషమ పరిస్థితులు

ప్రపంచ ఆర్థిక సంక్షోభ ఛాయల దుష్ప్రభావం

వంటి భయంకర పరిస్థితులను కళ్ళకు కట్టింది. ఇందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించకపోవడం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షో భాల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పడడం ప్రధాన కారణాలుగా అది చూపింది. దేశంలో నెలకొన్న ఈ విపత్కర పరిస్థితుల వల్ల ప్రభుత్వాలతో పాటే ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యవసర, అత్యవసర రేట్లు తారస్థాయికి చేరడంతో ప్రజలు పడుతున్న బాధలు తారస్థాయికి చేరుతున్నాయని తేల్చి చెప్పింది. ఏదో చేసేస్తున్నామని, ఎంతెంతో కష్టపడిపోతున్నామని డపðకొట్టుకుని చెపðకుం టున్న సర్కారు ప్రచారాలలో పసలేదని, అవి వాస్తవ విరుద్ధాలని ఈ నివేదిక చెప్పకనే చెప్పింది. ఈ 2011-12లో 9% అభివృద్ధి రేటు సాధించాల్సిన అవసరాన్ని నివేదిక నొక్కి చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కనుక ఈ యేడాది ఎంత కష్టపడాలనుకున్నా ఆ స్థాయిలో ప్రగతిరేటు రాదన్నది నిర్వివాదాంశం.