రానున్న కడప, పులివెందుల ఉప ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని జగన్ వర్గం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. శనివారం జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, తదితర శాసనసభ్యులు సమావేశమై.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రి, వైయస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు.
సమావేశం వివరాలు వెల్లడించేందుకు వీరు నిరాకరించినప్పటికీ.. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం విడిపోకూడదనే ఉద్దేశంతోనే తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నామని... చెప్తున్న నేతలు.. ఉప ఎన్నికల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మిపై వివేకానంద రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి కానీ, కడప పార్లమెంట్ నుండి కానీ పోటీకి దిగరాదని మెలిక పెట్టినట్లు సమాచారం.
వివేకా కాదంటే... తాము ఆయనపై పోటీ చేసేందుకు ఇప్పటికే అభ్యర్ధిని సిద్దంగా ఉంచామని జగన్ వర్గం చెప్తోంది.