26, ఫిబ్రవరి 2011, శనివారం

ఫిమేల్‌ ఉన్నికృష్ణన్‌

మలయాళంలో 'ఫిమేల్‌ ఉన్నికృష్ణన్‌' టైటిల్‌తో పూర్తి హాస్యభరితంగా రూపొందిస్తున్నారు. డూప్లికేట్‌ చిత్రంతో హీరోగా రంగప్రవేశం చేసిన సూరజ్‌ వెంజర్‌ మూడు ఇందులో టైటిల్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇతడు మహిళ పాత్ర పోషించడం లేదు అయినా ఆ టైటిల్‌ పెట్టారు.

కొంతమంది మగవాళ్ళ కంఠస్వరం ఆడవాళ్ళు మాట్లాడుతున్నట్టు విచిత్రంగా వుంటుంది. అదే ఈ చిత్రానికి ముఖ్యమైన పాయింట్‌. ఆడవాళ్ళ కంఠస్వరంలా వుండటంతో అతడు మగవాడే అయినా ఫిమేల్‌ ఉన్ని కృష్ణన్‌గా పాప్యులర్‌ అయ్యాడు తన వూరు జనానికి. ఎందుకంటే అతను మాట్లాడుతూంటే ఆ స్వరం అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. దీన్ని బేస్‌ చేసుకుని కథ అల్లారు దర్శకుడు మధు.

సలీమ్‌ కుమార్‌, జగతి, బిజూ కుట్టన్‌, కళాభవన్‌ ప్రజోడ్‌ మున్నగు హాస్య నటులు కూడా నటించడంతో ప్రతి సీన్‌ కామెడీని పండిస్తుందంటున్నారు దర్శకుడు కె.బి.మధు.

మహాలక్ష్మి అనే యువతి హీరోయిన్‌గా, షాజి సుకుమారన్‌ సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. తుళుజి, వేగమాన్‌, మున్నార్‌ పరిసరాల్లో సినాలి ఫిలిమ్స్‌ పతాకాన నిర్మాత షిజాయ్‌ వర్గీస్‌ షూటింగ్‌ పూర్తి చేసారు.