26, ఫిబ్రవరి 2011, శనివారం

అంతవరకు దోమలను కొట్టుకుంటూ బతకాల్సిందే....

ఇంట్లో దోమల వెూతతో బెంబేలెత్తుతున్నారా దోమలు కుట్ట డం తో జబ్బు పడాల్సివస్తుందని బాధపడుతున్నారా దోమలను చంపే మస్కిటోకాయిల్స్‌కోసం వందలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారా మలేరియా మహామ్మారికి భయ పడుతున్నారా అయితే మీకో శుభ వార్త...ఇకపై దోమలకు మీరు భయపడాల్సిన పనిలేదు. దోమ కాటు వల్ల ఇకపై ఎలాంటి అనా రోగ్య సమస్యలు ఉండవు. నిజం ... దోమకాటు వల్ల వచ్చే వ్యాధు లను నివా రించేలా సరికొత్త టీకా మందును అమెరికాలోని టులేన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేస్తు న్నారు.

భారతీయ శాస్త్రవేత్త నిర్భరు కుమార్‌ నేతృ త్వంలోనే ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. విషానికి విషమే విరుగుడు అన్న సూక్తి నిర్భరు బాగా వంట పట్టించుకున్నాడేవెూ దోమకాటుతో వ్యాపించే మలేరియాను దోమకాటుతోనే అడ్డుకోవాలని ఆయన చేస్తున్న ప్రయోగాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఆయన రూపొంది స్తున్న ఈ టీకా మందులో ఇకముందు మలేరియాను శాశ్వతంగా నిర్మూలించే వీలు కలుగుతుందట. ఈ టీకా వేసుకున్నవారిని దోమ కుట్టినపుడు ఆ యాంటీ బాడీస్‌ మలేరియా పరాన్నజీవి పునరు త్పత్తికి అవసరమైన ప్రోటీన్స్‌ ను నిర్వీర్యం చేసి మలేరియా వ్యాధి రాకుండా నియంత్రి స్తాయి. అంతవరకు దోమలను కొట్టుకుంటూ బతకాల్సిందే....