అంకుల్ పారు అంటేనే 'అమర్ చిత్రకథ, టింకిల్ కామిక్స' గుర్తుకొస్తాయి. అనంతపారు గురువారం నాడు అనంతలోకా లకు తరలి వెళ్లిపోయారు. ఈ చిత్రకథల రారాజు ఎందరో తమ విశిష్ట సేవలతో, గత 44 సంవత్సరాలుగా తన కథ లతో, కామిక్సతో నవ్వుల పువ్వుల్ని పండిస్తూ, దేశంలోనే కాక ప్రపంచఖ్యాతినార్జించి, ఎందరో బాలబాలికల అభిమా నాన్ని చూరగొన్నారు.
అనంతపారు వెంకటరాయ, సుశీల పారు దంపతులకు సెప్టెం బర్ 17, 1929లో కర్ణాటకలోని కర్క లలో జన్మించారు. వారు కెమిస్ట్రీ, ఫిజిక్స, కెమికల్ టెక్నాలజీ చదివినా, ప్రవృత్తి రీత్యా కామిక్స ప్రచురణలంటే ఎంతో ఇష్టమాయనకు. 1954లో 'ఎడిటింగ్ పబ్లిషింగ్' రంగంలోకి ప్రవేశించారు. అమర్ చిత్ర కథ సిరీస్‌ను 1967 లో ప్రారంభించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పుస్తక ప్రచురణ విభాగం 'ఇంక్రజాల్' పేరుతో కామిక బొమ్మల సిరీస్‌ని ప్రారంభించారు.
టింకిల్ పత్రికను 1980లో ప్రారంభించారు. అమర్ చిత్ర కథ 20 భాషలలో వెలువడింది. అంకుల్‌పారుకి పేరు తెచ్చిన టైటిల్స్ కృష్ణా, అశోక, అక్బర్, రాణిఝాన్సీ, వివేకానంద మొదలగునవి.
చారిత్రకం, జానపదం, వివిధ మతాల సంప్రదాయాలు - వాటి విశి ష్టత, జాతక కథలు, పంచతంత్ర కథలు లాంటి ఎన్నో కథలు,కథానికలు పారుకు అవార్డులు-రివార్డులు సంపాదించి పెట్టాయి. హనుమాన్, చాణక్య, అభిమన్యు గాథలు ఆయన కీర్తి ప్రతిష్టలను మరింత పెంచ డమే కాక, బాలబాలకలకు స్ఫూర్థి ప్రదాయకంగా వున్నాయి. ప్రతాప్ మల్లిక, రామ్ వయీర్‌కర్ కుంచెలు తోడవడంతో కథ లకు బొమ్మల అందాలు కలిసి వచ్చి కథలోని పాత్రలు ప్రాణం పోసుకున్నాయి.
అనంతపారు వీరుల గాథలే కాకుండా, ప్రముఖుల జీవిత చరిత్రలు అనేకం రాసారు.
ప్రముఖ చిత్రకారులు ప్రతాప్ మాలిక, సౌరెన్‌రారు, ఝప్రే ఫౌలర్, హెచ్.ఎస్. చవాన్, మధు పౌలే, చంద్రకాంత్, డి.రాణి పారు కథలకు బొమ్మలు వేయడానికి ముందుకు వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అంకుల్ పారు కథలకు ప్రాముఖ్యత ఏర్పడింది.
అనేక పుస్తకాల షాపుల్లో టింకిల్, అమర్ చిత్ర కథ పుస్తకాలు కొనుగోలుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ పాఠశాలలు, గ్రంథాలయ సంస్థలు వీటిని తెప్పించుకోవడం, అనంతపారు ప్రతిభా సంపత్తులకు తార్కాణం. అనంతపారు కర్ణాటక ప్రాంతం వారైనా, వారు వివిధ ప్రాంతాల విద్యార్థుల మనసులను దోచుకున్నారు. వారు ముంబరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నా, అనేక ప్రాంతవాసులు, వారు కథలు చెప్పే తీరు చూసి వారి వారి ప్రాంతాలకు రప్పించుకొని, సత్కార కార్యక్రమాలెన్నో నిర్వహించారు. పారు కేవలం పిల్లలకు కథలు చెప్పడమే కాకుండా వారితో సరదాగా మెలిగేవారు. వారు ఏ అంశం తీసుకున్నా, ఆ కథను తన రచనాశైలితో రక్తి కట్టించేవారనడంలో ఎంతమాత్రం సం దేహం లేదు. వారు వయసు పై బడినా తరం తరం, నిరంతరం వారిని గుర్తుంచుకునేలా రచనలు చేసేవారు. తన రచనలతో ఆబాలగోపాలాన్ని అలరించేవారు. ఈయన కలం నుంచి జాలువారిన ఎన్నో కథలు సిడీలుగా , డివిడిలుగా రూపుదిద్దుకొని మార్కెట్‌లో విస్తారంగా చోటు చేసుకున్నాయి. ఆంధ్రపాఠకులకు చందమామ,బాల మిత్రల్లా, పారు కథలు ప్రపంచ వ్యాప్తంగా చిన్నపిల్లల్ని విపరీ తంగా ఆకర్షిస్తున్నాయి.
ముంబరులోని బెస్ట్ బస్సులు అమర్ చిత్రకథలను బ స్సులపైకి ఎక్కించాయంటే ఆయన ఎంతటి ప్రతిభాశాలో అర్థం చేసుకోవచ్చు. కొం దరు పాఠశాలలోని ఇళ్ళల్లో కూడా ఇంటీరియర్ డిజైన్లుగా అమర్‌చిత్ర కథలను గోడల పైకి ఎక్కించారు.
దీన్నిబట్టి చూస్తే వారు కథలు చెప్పే విధానం, ఆబాల గోపాలాన్ని ఆశ్యర్యపరుస్తుంది. పలు పాఠశాలలు, బోధనా సంస్థలు అమర్ చిత్ర కథలను నీతిపాఠాలుగా బోధిస్తున్నాయి.
నేడు టీవీల ప్రభావంగా పుస్తకాలు కొని చదివే అలవాటు కొరవడుతోంది. అయినా, అనంత్‌పారు రాసిన పుస్తకాలకు, టింకిల్ మ్యాగజైన్లకు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు.
అంకుల్ పారు అజరామర కృషి ఫలితంగా ఆయన కలం నుంచి అనేకానేక పుస్తకాలు పిల్లల్లో చైతన్యస్ఫూర్తిని కలిగించి నీతిని బోధిస్తు న్నాయి. నేడు కృష్ణా, హనుమా త్రీడిలుగా వస్తున్నాయంటే వారి స్ఫూర్తికి, అనంతపారు ముఖ్యకారకులు.
వర్ధమాన కాలమానపరిస్థితులకనుగుణంగా, పిల్లల సైకాలజీకి తగి నట్లుగా వారి రచనలు సాగుతూ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. అనంత పారు కథలు కేవలం పిల్లలకే కాక పెద్దలకు కూడా ఆసక్తిదాయకంగా ఉండేవి. దీనికి కారణంగానే వారు కూడా పిల్లలు చదివిన తర్వాత పెద్దలు కూడా చదివేవారు.
అనంతపారు భౌతికంగా నేడు లేకున్నా, చిన్నారి హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న అమరజీవిగా ఆయన పేరు కలకాలం నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.