ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ తాకింది. ఢిల్లీ పర్యటనకు వచ్చారని తెలుసుకున్న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, ఢిల్లీలోని జెఎన్‌యు విద్యార్థులు శనివారం ఉదయం కిరణ్ కుమార్ రెడ్డి బస చేసిన ఎపి భవన్ వద్ద ధర్నాకు దిగారు. విద్యార్థులు ఒక్కసారిగా కాకుండా విడివిడిగా వచ్చి వ్యూహాత్మకంగా ధర్నాకు దిగారు.మా తెలంగాణ మాకు కావాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.