26, ఫిబ్రవరి 2011, శనివారం

114 కేంద్రాల్లో 'మిరపకాయ్‌' అర్థశతదినోత్సవం

సంక్రాంతికి విడుదలైన రవితేజ 'మిరపకాయ్‌' 114 కేంద్రాల్లో 50 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుందని ఎల్లోఫ్లవర్స్‌ అధినేత, నిర్మాత రమేష్‌ పుప్పాల తెలిపారు. 'మా సంస్థ తీసిన తొలిచిత్రమే ఇంతటి విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. ఈ విజయానికి కథానాయకుడు రవితేజ, దర్శకుడు హరీష్‌శంకర్‌, ఇతర యూనిట్‌ సభ్యులు కారణం. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. త్వరలో వేడుక నిర్వహిస్తాం' అన్నారు.

'ఈ సక్సెస్‌ క్రేడిట్‌ అంతా దర్శకుడు హరీష్‌శంకర్‌కు చెందుతుంది. నిర్మాత రమేష్‌ నాకు మంచి స్నేహితుడు అయ్యారు ఈ విజయానికి కారణమైన అందరికీ థాంక్స్‌' అన్నారు రవితేజ.

'షాక్‌' ఫలితంతో నిరాశపడిన నాకు మళ్ళీ మిరపకాయ్‌ చేసే అవకాశం కల్పించారు రవితేజ, రమేష్‌ పుప్పాల. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అన్నారు హరీశ్‌శంకర్‌