దీక్ష విరమించిన జగన్
విద్యార్థుల ఫీజుల సాధన కోసం ఏడు రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేసిన మాజీ ఎంపీ వైఎస్ జగన్ అశేష ప్రజానీకంగా సాక్షిగా ఇందిరాపార్క్ సమీపంలోని వరలక్ష్మి దీక్షా ప్రాంగణంలో ఫీజుపోరు విరమించారు. గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వరలక్ష్మి తల్లి లక్ష్మమ్మ జగన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. జననేత జగన్‌కు మద్దతుగా నేతలు, ప్రజలు, విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు. యువనేతకు సంఘీభావంగా వచ్చిన జనంతో ధర్నాచౌక్ పోటెత్తింది.