ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఆదిలా బాడ్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని బొప్పారం తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జ్యోతికి శుక్రవారం నాటికి 271వ రోజుకు చేరుకుంటుంది.
ఉద్యమంలో భాగంగా గ్రామ జేఏసీ నాయకులు ఫిబ్రవరి 8న ఈ అఖండ జ్యోతిని వెలిగించారు. తెలంగాణ ఏర్పాటు జరిగేంత వరకు జ్యోతిని వెలుగుతూనే ఉంటుందని గ్రామ జేఏసీ నాయకులు పేర్కొన్నారు.