ఏఐసీసీ సమావేశంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తావన లేకపోవడం తెలుగువారిని అవమానించడమేనని పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. చేసిన తప్పుకు ఏఐసీసీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులకు క్యారెక్టర్ లేదంటూ ముఖ్యమంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దిగజార్చేవిధంగా ఉన్నాయన్నారు.
అసలు లీకువీరులు సీఎం పేషీ అధికారులేనని అన్నారు. ఏపీఐఐసీ వ్యహారంలో డీఎల్ రవీంద్రారెడ్డితో సీబీఐ విచారణకు డిమాండ్ చేయించింది రోశయ్యేనని ఆయన ఆరోపించారు. టాలెంట్ హంట్ ద్వారా యూత్ కాంగ్రెస్ నేతల ఎంపికలో అవినీతి, అవకతవకలు జరిగాయన్నారు. వైఎస్సార్, జగన్ అభిమానులను పదవులను నుంచి తప్పించేందుకు టాలెంట్ హంట్ జరిపారని అంబటి ధ్వజమెత్తారు.