5, నవంబర్ 2010, శుక్రవారం

కేసీఆర్ ... నరకాసురుడు...

రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ అభినవ నరకాసురుడు కేసీఆర్ దిష్టిబొమ్మను తిరుపతిలో దగ్ధం చేశారు.

అలజడులు సృష్టి స్తూ రాష్ట్రంలో శాంతికి విఘాతం కలిగించేలా కేసీఆర్ నరకాసురుడులా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతికి భగ్నం కలిగిస్తే నరకాసురుడి గతే కే సీఆర్‌కు పడుతుందని హెచ్చరించారు సాప్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.రాజారెడ్డి .

నరక చతుర్ధశిని పురస్కరించుకుని సాప్స్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు..రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ వేర్పాటు వాదాన్ని రెచ్చగొడుతూ రాష్ట్రాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.