5, నవంబర్ 2010, శుక్రవారం

మా ఎమెల్యేని వెతికి పెట్టండి

వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై అత్యధిక మెజారిటీతో గెలుపొందిన రమేష్‌బాబు గత కొంతకాలంగా కనిపించడంలేదంటూ కాంగ్రెస్‌నేతలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో సిఐని కలుసుకొని ఫిర్యాదు చేశారు.

ప్రజలు, రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూంటే ఎమ్మెల్యే నియోజక వర్గాన్ని, ప్రజలను గాలికి వదిలేసి ఏవో కుంటిసాకులు చెబుతూ తప్పించుకొని తిరుగుతున్నాడని, నియోజకవర్గాన్ని పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు. ప్రజలు ఎంతగానో ఆశపడి రమేష్‌బాబును గెలిపిస్తే, గెలిచిన మూడు, నాలుగు ఒద్దులు మినహా ఎప్పుడు కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉండటంలేదని విమర్శించారు.