తెలంగాణా అంశం చుట్టూ నడిచే కథాంశంతో దర్శకుడు ఎన్.శంకర్ 'జై బోలో తెలంగాణా' తీస్తున్నారు. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్.శంకర్ మాట్లాడుతూ...'టాకీతోపాటుగా రెండు పాటలు పూర్తయ్యాయి. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయింది. నవంబర్ నెలాఖరులో ప్రొడక్షన్ పూర్తవుతుంది. డిసెంబర్‌లో సినిమా విడుదల అవుతుంది. తెలంగాణ రావడానికి కారణమైన సాయుధ పోరాట యోధుల్లో ఒక ముఖ్యమైన నాయకుడి పాత్రను ఒక ప్రముఖ హీరో పోషించనున్నాడు' అని చెప్పారు.