ప్రపంచంలోని అత్యంత శక్తి మంతుల్లో చైనా అధ్యక్షుడు హు జింటావొ అగ్రస్థానంలో నిలిచారు. మార్పు నినాదంలో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన బరాక్ ఒబామా ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు.
ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన అత్యంత శక్తిమంతుల జాబితా-2010లో భారత్ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా, ఎన్నారై పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌లకు చోటు దక్కింది.
సోనియా 9, మనోహ్మన్ 18వ స్థానాల్లో నిలిచారు. ముఖేష్ 34, లక్ష్మీ మిట్టల్ 44, రతన్ టాటా 61 ర్యాంక్ దక్కించుకున్నారు.