5, నవంబర్ 2010, శుక్రవారం

కేసీఆర్ ఖబడ్దార్! మేం తలచుకుంటే నువ్వు తిరగలేవ్

‘కేసీఆర్ కూతురు కవిత ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినిమా ఫంక్షన్లకు హాజరవుతోంది. కుమారుడు కేటీఆర్ ఆంధ్ర వారితో వ్యాపారాలు చేస్తున్నాడు. కేసీఆర్ ఆంధ్ర ప్రాంత పరిశ్రమల సీఈఓలతో సమావేశం అవుతారు. ఇదేనా కేసీఆర్ చేసే తెలంగాణ ఉద్యమం’ అంటూ ప్రశ్నించారు. ఆయన తెలంగాణ అంశంపై పార్లమెంటులో ఎన్నిసార్లు మాట్లాడారో ప్రజలకు వివరించాలని తెలుగుదేశం ఎంపి రమేష్ రాథోడ్ డిమాండ్ చేశారు.

ఇటీవల రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, టీఆర్‌ఎస్ నాయకులు కార్యక్రమాన్ని అడుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని ... టీడీపీ కార్యకర్తలు తలచుకుంటే టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు గడప దాటి బయటకు వెళ్లలేరని, కేసీఆర్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.