సోనియా తన జన్మదినకానుకగా తెలంగాణ ఇచ్చిందని చెప్పిన కెసిఆర్కి ఆమె జన్మదినం మళ్ళీ వస్తోందని గుర్తు చేయాలని అనుకొంటున్నాం' అని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు అన్నారు.
. నాగం జనార్ధనరెడ్డి, కడియం శ్రీహరి, హరీశ్వర్ రెడ్డి గురువారం మీడియా తో మాట్లాడుతూ 1956 నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే వస్తోంది. తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చి కేంద్రం డిసెంబర్ 23వ వెనక్కు తీసుకొంది. తెలంగాణ ప్రజలను మోసం చేసింది..తెలంగాణ ప్రకటనను కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తీసుకొన్న డిసెంబర్ 23వ తేదీని విద్రోహ దినంగా పాటిస్తామని ప్రకటించారు.
నాలుగు వందల మంది చనిపోయినా ..నిర్ణయించాంనిన్న ఎఐసిసి సదస్సులో దేశంలోని అన్ని విషయాలు మాట్లాడి తెలంగాణ ఊసే ఎత్తలేదు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు గుర్తు చేయడానికి విద్రోహ దినంగా పాటించాలని నిర్ణ యించినట్లు చెప్పారు
.