న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం నాడు ఇక్కడ మొతేరాలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ కివిస్ బౌలర్లను ‘వీర’ బాదుడు బాదారు.
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్ (173) చెలరేగి ఆడి కివీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించగా, ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ కూడా తనదైన శైలిలో రాణించి సెంచరీతో అలరించాడు.