5, నవంబర్ 2010, శుక్రవారం

చిత్ర విచిత్రాలకు కాంగ్రెస్సే సాటి

ఒంగోలు రాజకీయంగా చిత్ర విచిత్రాలు చేయడంలో కాంగ్రెస్‌కు కాంగ్రెస్సే సాటని మరోసారి నిరూ పితమైంది. యువజన కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుల నియామక వ్యవహారం అందుకు తార్కాణంగా నిలుస్తోంది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత జారీ అయిన నియా మకపు ఉత్తర్వులు బుధవారం మధ్యాహ్నానికి నిలిచిపోయాయి. అందుకు కారణాలు ఏమైనా, కారకులు ఎవరైనా కాంగ్రెస్ మార్క్ వ్యవహారం ఎప్ప టికీ ఇంతే అన్న చందంగా వ్యవ హారం మారింది. ఈ నియామకా ల్లో జరిగిన మన జిల్లా అధ్యక్షుడి నియామక అంశం జగన్ వర్గీయుల ను సైతం ఆశ్ఛర్యానికి గురి చేసింది.

ప్రస్తుతం తాత్కాలికంగా నియామకాలు ఆగిపోవడంతో ముందు ముందు రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోననే అంశం ఆసక్తికరంగా మారింది.