5, నవంబర్ 2010, శుక్రవారం

పవన్‌కళ్యాణ్‌ చిత్రానికి హాలీవుడ్‌ డిజైనర్‌

ఆదిత్య ప్రొడక్షన్‌పై కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్న చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. హాలీవుడ్‌లో ప్రముఖ చిత్రాలకు ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న స్టీఫెన్‌.ఎం.ఆర్టలానీ ఈ సినిమాకు పనిచేయడానికి సిద్ధమవుతున్నారు.

మిషన్‌ ఇంపాజిబుల్‌-3, లెటర్స్‌ టు జూలియట్‌ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు ఆర్టలానీ పనిచేశారు. వార్నర్‌బ్రదర్స్‌, పారామౌంట్‌, ట్వంటీయత్‌ ఫాక్స్‌, కొలంబియా వంటి సంస్థలకు తన సేవలందించారు. పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న ఈ చిత్రం కాన్సెప్ట్‌ విని పనిచేయడానికి అంగీకరించారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన లొకేషన్స్‌, సెట్‌లు, మేకప్‌లు, కాస్ట్యూమ్స్‌ తదితర డిజైన్లు తయారు చేసుకుని 8న భారతదేశానికి వస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో పవన్‌కళ్యాన్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన: భారవి, కెమెరా: శేఖర్‌ వి.జోసెఫ్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: శేషు, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు.