ఒకప్పుడు కేవలం తెల్ల జుట్టును నల్లగా చేసుకునేందుకు హెయిర్‌కలర్స్ అన్న భావన నుండి...
ఫ్యాషన్ ప్రపంచంలో `వచ్చిన అనేక మార్పులకు తగ్గట్టు అనేక రంగులొచ్చాయి.
ఇవి ఆకర్షణీయ కేశాలకు సరికొత్త అందాలు ఇవ్వటంతో
పాతికేళ్ల పడచులే కాదు... పండు ముసలమ్మలు సైతం నేడు రంగులేసుకుంటున్నారు...
తద్వారా మరింత ఆనందాలను పొందేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
కేవలం ముఖం మాత్రమే కాదు... కేశ సౌందర్యానికి కూడా ప్రాముఖ్యత ఇస్తు....తమ అందాలను మరింత అకట్టుకునేలా రూపొం దిం చుకుంటున్నారు నేటి తరం అమ్మయిలు.
కేశాలంకరణలో భాగంగా నేడు అనేక రకాల వస్తువులు మార్కె ట్‌లోకి వచ్చేసాయి. అందునా... అనేక రకాల రంగుల్ల్లొ కేశాలను అలంకరించు కోవటం పెద్ద ఫ్యాషన్‌గా మారి పోయింది. జుట్టు అందాలను మరింతగా మెరిసేలా చేసేందుకు ఈ రంగులు ఉప యుక్తంగా ఉంటున్నాయన్నది... హెయిర్‌కలరింగ్‌తో పెరుగు తున్న వయసును ఏమాతం కనిపించకుండా చూసుకోవచ్చన్న ఆనందం నేడు ఎందరిలోనో కనిపిస్తోంది.
కురులకు కొత్త అందాలు ఇవ్వటంలో నేడు రంగులు కీలక భూమిక పోషిస్తున్నాయనటం వాస్తవం. నలుపుతో పాటు గోల్డెన్, మెెరూన్, పర్సుల్, చెర్రీ, హనీ బ్రౌన్, బ్లాక్ బ్రౌన్, బ్రౌన్‌తో పాటు అనేక రంగులు నేడు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.
సమాజంలో భిన్నంగా కనిపించాలన్న తపన ఉన్న మహిళలు చాలామంది ఈ రంగులను వినియోగించి కొత్త అందాలనే కాదు... ఆనందాలను పొందుతున్నారన్నది నిజం. భిన్నంగా కనిపించేలా చేయటమే కాకుండా... వయసుని దాచేయటంతో రంగులు అద్భుతంగా పనిచేస్తున్నాయని నేటి తరం సైతం అంగీకరిస్తున్న సత్యం.
సెమీ పర్మినెంట్ కలరింగ్ :
సెమీ పర్మినెంట్ కలరింగ్‌లో లభ్యమయ్యే వివిధ రంగుల్లో అమ్మోనియా శాతం తక్కువగా ఉంటుంది. దీంతో ఈ రంగులు ఎక్కువ కాలం కేశాలని పట్టి ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు మార్చుకునే అవకాశం ఉండదు.
హైలెట్స్ కలరింగ్ :
హైలెట్స్ కలరింగ్‌లోనూ వివిధ రంగులు సహజత్వానికి దగ్గర చేసేలా వేసుకోవాలి. లేదంటే ఇబ్బందిగా కనిపిస్తుంది. సహజ సిద్దం గా కనిపించే రంగులని కేశాలకు వేసుకున్న తరువాత జుట్టును పాయలుగా తీసుకుని వేరే రంగుల్ని వేసుకొంటే... భిన్నంగా కనిపి స్తారు. ఈ హైలెట్ కలరింగ్‌కి ఇప్పుడు చాలా ప్రాధాన్యత కనిపి స్తోంది.
తాత్కాలిక రంగులే బెటర్ :
నిెర్జీవ కేశాలకు అందంగా కనిపించేందుకు వాడే రంగులు శాశ్వ త రంగుల కన్నా తాత్కాలిక రంగుల కే ప్రాధాన్యత ఇవ్వటం మంచి దని చెప్తున్నారు. చర్మ వ్యాధి నిపుణులు. బ్యుటీషియన్లు.
రంగులు ఒక్కో సారి పడక పోతే అలెర్జీలు, అర్జీమాలు వచ్చే అవకాశం ఉందని ... అంతే కాక కురుల మొదళ్లలోకి వెళ్లి కురుల సహజ రంగుల్ని నిర్వీర్యం చేస్తాయని...ఓ వేళ రంగులు వాడాల్సి వస్తే... ముందు ఖచ్చి తం గా నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తాత్కాలికంగా ఉండే రంగులను వాడుకోవటం వల్ల ఎప్పటి కప్పుడు కేశాలను శుభ్రపరచుకుని... అవసరమైనప్పుడు వేరే రంగు వేసుకుని..నిత్యం ఫ్రెష్‌గా కనిపించడం ఒకటైతే... సహజత్వానికి తగిన రంగుల్ని ఎంపిక చేసుకోవటం కూడా ప్రధానమే..
రంగుల ఎంపికలు ఎలా?
శరీరానికి సరిపోయే విధంగా కేశాలంకరణ ఉంటేనేఅందం. అందుకు తగ్గట్టుగా రంగుల ఎంపిక జరగక పోతే... అందవిహీనంగా మిమ్మల్ని కనిపించేలా చేస్తాయి. అంతే కాదు. మీ ముక్కు తీరు, ముఖ ఆకారం, కూడా రంగులని ఎంపిక చేసుకునేందుకు ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ కవళికలకు తగ్గ హెయిర్ స్టైల్ చేసుకుంటేనే అందరి కన్నా భిన్నంగా కనిపించే అవకాశాలుంటాయని బ్యుటీషియన్లు చెప్తున్నారు. రంగులు వేసుకునే ముందు నిపుణుల సలహా సూచనలు పాటించడం మంచిదని... లేదంటే లేనిపోని అవాంతరాలు వచ్చిపడి... జుట్టు ఊడిపోయే ఆస్కారం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
గుర్తుంచుకోండి...
సహజత్వానికి దగ్గరగా ఉండాలని భావించే వారు... అందుకు తగ్గట్టుగా కలరింగ్ చేసుకునే ప్ర్‌క్రియ ప్రారంభించాలి. ఇందుకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం....
రంగులు తరచు మార్చాలనుకునే వారు నిత్యం జుట్టు పొడిగా ఉండేలా చేసుకోవటం ఎంత ముఖ్యమో... వాడుతున్న రంగులు మీకు పడుతున్నాయా? లేదా? అన్నది గమనించడం కూడా అంతే ముఖ్యం.
ఇష్టానుసారం రంగులు మారుస్తూ... కొత ్తదనాన్ని ఆస్వాదిం చడం ఎవరికీ అభ్యంతరం లేకపోయినా... జుట్టు ఊడిపోయే అవకా శాలుంటే అందుకు తగ్గ చర్యలు నిపుణుల పర్యవేక్షణలో తీసుకోంటూ జాగ్రత్త పడాలి.వీలైనంత వరకూ అనవసర ప్రయోగాలకు దూరంగా ఉండటమే మంచిది.
తలపై గాయాలు గానీ, కురుపులు గానీ ఉన్న ప్పుడు రంగులు వేసుకునేందుకు దూరంగా ఉండటం మంచిది. లేదంటే... గాయాల ద్వారా... కలర్స్ కెమికల్స్ శరీరంలోకి చేరి వేరే సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.
హెన్నా పెడుతూ వస్తున్నవారు ఎప్పటికీ ఇంకా జుట్టు నల్లబడ లేదని అర్ధంతరంగా రంగులు వేసేందుకు ప్రయత్నిస్తే... జుట్టు రాలే అవకాశాలు బోలెడు ఉన్నాయి. కనుక హెన్నా పెట్టడం ఆపేసి.. కనీసం నాలుగు నెలల తరువాతనే ఆ కేశాలకు రంగులు అద్దటం శ్రేయ స్కరం., అలాగే రంగులు వాడుతున్న వాడుతున్న వారు హెన్నా వాడితే ఉపయోగం ఉండదు.
రంగులు వేసుకునే ముందు... వీలైనం తవరకు కేశాలను దగ్గరగా కట్ చేయించుకుని వేసుకుంటే మంచిది. ముఖ్యంగా మహిళలు కురుల చివర్లు చిట్లిపోయి కనిపిస్తుంటాయి... ఇలాంటి సమయంలో రంగులు వేస్తే కేశాలు అందవిహీనంగా తయారవుతాయి. అందుకు తగ్గట్టుగా ట్రిమ్మింగ్ చేసుకోండి. అందువల్ల నష్టాలను ముందుగానే నివారించుకోవచ్చు.
రంగులు వేసుకునే వారు వీలైనంత ఎక్కువగా నీడలోనే ఆరేలా చూస్తే మంచిది. ఇప్పుడు మార్కెట్‌లో నిమిషాల్లో ఆరిపోయే రంగులు చాలా వచ్చేసాయి కనుక ఎలక్ట్రీకల్ డ్రై మిషన్ల పని చాలా వరకు తగ్గిందనే చెప్పాలి.
రంగులు వేసుకునన్న వారు ముఖ్యుంగా ఏదో ఒక ష్యాంపూని వేడేయటం వల్ల రంగులపై ప్రభావం చూపి తొందరగా అవి వదిలేసే ప్రమాదం ఉంది.
అలాగే మీరు మీ కురులపై రకరకాల ప్రయోగాలు చేస్తే.. ఊడి పోగలవ్ జాగ్రత్త. రసాయనాల కారణంగా వెంట్రుకలు బిగుసుకు పోయే ప్రమాదం ఎక్కువగా ఉండటమే కాకుండా పొడిగా మారి... రాలటం ప్రారంభిస్తాయి.
అందువల్ల కండిషర్‌లు, షాంపూలు కలరింగ్‌లకోసం ప్రత్యేకంగా తయారు చేసినవి మాత్రమే వాడాల్సి ఉంటుంది. కరింగ్ వేసుకున్న రోజున వర్షంలో తడవటం, ఈతకు వెళ్లడం కూడా మీ కేశాలకు శ్రేయస్కరం కాదు.
ఎండలో తిరగటం వల్ల కూడా కేశాలకు, అవి వాడిన రంగులకు ప్రమాదాలు తెస్తుంది. సూర్య కాంతిలోని అతినీలలోహిత కిరణాలు కేశాలపై అధిక ప్రభావం చూపి వాటిని నిర్జీవం చేస్తాయి. ఈ క్రమంలో హెయిర్ కలరింగ్ వేసుకున్న తొలి రోజుల్లో కాస్త్త గుడ్డని జుట్టుకి కట్టుకుని తిరిగితే మంచిది.
జుట్టు తత్వాన్ని బట్టి వారానికి రెండు సార్లయినా తలంటు స్నానం చేస్తే... చుండ్రు తదితరాలకు దూరంగా ఉండొచ్చు. సగటున ప్రతిరోజు 100 వరకు వెంట్రుకలు రాలటం సహజమైనదేనని... అంత మాత్రాన అందోళన చెందాల్సిన అవసరమేలేదని... అంతకు మించి పాయలు పాయలుగా తలని దువ్వుతున్నా... రంగులు వేసుకున్న ప్పుడు జుట్టు చేతిలోకి వచ్చేస్తే... ఖచ్చితంగా నిపుణులను సంప్రదించాలి