రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన కృష్ణా
జిల్లా నుండి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల
శంఖారావం పూరిస్తారని తెలుస్తోంది. ఈనెల మూడవ వారంలో ఆయన కృష్ణా జిల్లాలో
పోరుబాట పేరుతో విస్తృతంగా పర్యటించనున్నారు. మైలవరం నుండి గాని, లేదా
గుడివాడ నుండి గాని బాబు పర్యటన ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్గాల ద్వారా
తెలిసింది. రైతు సమస్యలు ప్రధానంగా ఈ పోరుబాట సాగుతుందని పార్టీ వర్గాలు
చెబుతున్నప్పటికీ స్థానిక ఎన్నికల ప్రక్రియ త్వరోనే ప్రారంభం కానున్న
నేపధ్యంలో చంద్రబాబు నాయుడు ఈ పోరుబాటనే స్థానిక ఎన్నికల పోరాట బాటగా
ఎంచుకుంటారని తెలుస్తోంది. ఈ పర్యటన ద్వారా పార్టీ కేడర్లో నూతన జవసత్వాలు
నింపేందుకు బాబు ప్రయత్నించనున్నారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం
పార్టీని గెలిపించాలనే సందేశాన్ని ప్రజలకు చంద్రబాబు ఇవ్వనున్నారు. ఇదివరకు
జిల్లాలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్రసాగింది. ఆ యాత్ర ద్వారా జగన్ జిల్లా
అంతటా పర్యటించి మత పార్టీ వైపు ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించారు.
అప్పుడు సైతం జగన్ పేరుకు ఓదార్పు యాత్రే అయినా ఆయన యాత్ర రైతు సమస్యల
పైనే సాగిన విషయం తెలిసిందే. చివరకు ఆయన తన ఓదార్పు యాత్ర చివరి రోజు
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుటు రైతు మహా ధర్నా నిర్వహించి రైతులను
ఆకట్టుకునే ప్రయత్నంచేశారు. అయితే అదే తరుణంలో అనివినీతిని అంతం చేయాలంటూ
అన్నా హజారే స్పూర్తితో చంద్రబాబు నాయుడుకూడా జిల్లాలో పర్యటించారు. అయితే
ఇప్పుడు స్థానిక సమరానికి దాదాపు పార్టీలన్నీ సర్వసన్నద్ధమ వుతున్నాయి. ఈ
తరుణంలో చద్రబాబు నాయుడు పోరు బాట రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలుగుదేశం పార్టీకి స్వర్గీయ ఎన్‌టీ రామారావు కాలంనుండి కృష్ణాజిల్లా
పెట్టని కోటగా వస్తోంది. అయితే ఎన్టీఆర్ మరణానంత రం పార్టీ కొంత దెబ్బతిని
కాంగ్రెస్ పార్టీకి కూడా బలమైన జిల్లాగా మారింది. ఇప్పటికీ జిల్లాలో
టిడిపికి బలమైన కేడర్ ఉంది, నాయకత్వం ఉంది. గత స్థానిక ఎన్నికల సమయంలో
వైఎస్‌ఆర్ అభివృద్ధి మంత్రం బాగా పనిచేసిందనే వాదన ఉంది. అయితే ఈసారి జరగ
బోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ అండ కాంగ్రెస్‌కు ఉండే అవకాశాలు లేవు. పైగా అదే
వైఎస్ ఆర్ తనయుడు సొంత పార్టీని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ ఓట్లను
భారీగా చీల్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలను తెలుగుదేశం పార్టీ తమ పార్టీ
విజయానికి ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై ముందస్తు వ్యూహ రచన చేస్తోంది. అదే
సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులను
స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరహర
శెట్టి నరసింహారావు ఇప్పటికే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, మంత్రి
పార్ధ సారధిల సూచనలతో జిల్లాలో పర్యటిస్తున్నారు. మండల కాంగ్రెస్, బ్లాక్
కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను సైతం చేప డుతున్నారు. పార్టీ కేడర్‌ను
బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరో పక్క యూత్
కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరుపుతున్నారు. ఇక వామపక్ష
పార్టీలు కూడా తమ పార్టీ క్యాడర్ను సన్నద్దంచేస్తున్నాయి. గత స్థానిక
ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. మెజారిటీ
జడ్పీటీసీ లను గెలుచుకుని జిల్లా పరిషత్‌ను గెలుచుకుంది. మెజారిటీ ఎంపీపీ
స్థానాలను గెలుచుకుంది. అదే విధంగా గ్రామ పంచాయతీల్లో కూడా కాంగ్రెస్
పార్టీకి చెందిన వారే మెజారిటీ స్థానాల్లో సర్పంచులుగా గెలిచారు. జిల్లాలో
మొత్తం 49 మండలాలకు గాను 25 ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్ గెలవగా, టీడీపీ 23
స్థానాలను దక్కించుకుంది. కాగా మిగిలినవి వామ పక్ష పార్టీలు
గెలుచుకున్నాయి. అదే విధంగా జడ్పీటీసీ స్థానాలు 49 లో 32 కాంగ్రెస్
గెలవగా, 13 స్థానాల్లో మాత్రమే టిడిపి గెలుచుకుంది. ఇక మిగిలినవి ఇతరులు
గెలచుకున్నారు. జిల్లాలో మొత్తం 972 గ్రామ పంచాయితీల్లో మెజారిటీ పంచా
యితీలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ ఫలితాలు వైఎస్ రాజశె ఖర్‌రెడ్డి
అభివృద్ది పధకాలు పెట్టి అభివృద్ది మంత్రంతో సాధిం చనవి. అయితే ఈసారి
జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. రానున్న స్థానిక ఎన్నికల్లో
కాంగ్రెస్ ఓట్లను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ భారీగా చీల్చే అవకాశం ఉంది.
జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్‌లకు గట్టి పోటీనిచ్చే అవకాశాలున్నాయి. అంటే
ప్రతి చోట త్రిముఖ పోటీ ఉంటుంది. ఈ పోటీలో ప్రధానంగా కాంగ్రెస్ ఓట్లు
భారీగా చీలిపోతే అది టిడిపి లాభిస్తుందని పరిశీలకు విశ్లేషిస్తున్నారు.
టిడిపి కూడా ఇదే నమ్మకంతో ఈ సారి కృష్ణాజిల్లాలో పసుపు జెండా రెపరెపలాడడం
ఖాయమ నే అభిప్రాయంతో ఉంది. అందుకే ముందస్తుగానే పార్టీ అధినే తను జిల్లా
పర్యటనకు జిల్లా పార్టీ రప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మూడంచెల పంచాయతీరాజ్‌పై పార్టీల్లో చర్చ
ఇటీవల ముఖ్యమంత్రి అసెంబ్లిdలో మూడంచల పంచాయ తీరాజ్ వ్యవస్థను తెరమీదకు తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానంలో ఎంపిటిసి, జడ్పిటిసిలుండరు. గ్రామ పంచాయితీ సర్పంచులే మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నుకుంటారు. అదే విధంగా ఎంపిపిలంతా కలసి జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ మార్పువల్ల రాజకీయంగా కలిగే మార్పులేమిటనే విషయంపై కూడా పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఎంపిటిసిలు, జడ్పిటిసిల ను రద్దు చేయడంతో జిల్లాలో దాదాపు వందల సం ఖ ్యలో ఎంపిటిసి, 49 మంది జడ్పిటిసిలు పదవులు కోల్పోతారు. ఈ విధానంపై పార్లమెంటులో చట్టం తేవాల్సిన అవసరం ఉ ంటుంది. అయితే తక్షణమే దీన్ని అమలు చేసేందుకు కార్యనిర్వహక ఉత్తర్వులను ఉపయోగించుకో వచ్చునని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇప్పటికే మన రాష్ట్రం ఈ మూడంచల విధానంకోసం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
మూడంచెల పంచాయతీరాజ్‌పై పార్టీల్లో చర్చ
ఇటీవల ముఖ్యమంత్రి అసెంబ్లిdలో మూడంచల పంచాయ తీరాజ్ వ్యవస్థను తెరమీదకు తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానంలో ఎంపిటిసి, జడ్పిటిసిలుండరు. గ్రామ పంచాయితీ సర్పంచులే మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నుకుంటారు. అదే విధంగా ఎంపిపిలంతా కలసి జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ మార్పువల్ల రాజకీయంగా కలిగే మార్పులేమిటనే విషయంపై కూడా పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఎంపిటిసిలు, జడ్పిటిసిల ను రద్దు చేయడంతో జిల్లాలో దాదాపు వందల సం ఖ ్యలో ఎంపిటిసి, 49 మంది జడ్పిటిసిలు పదవులు కోల్పోతారు. ఈ విధానంపై పార్లమెంటులో చట్టం తేవాల్సిన అవసరం ఉ ంటుంది. అయితే తక్షణమే దీన్ని అమలు చేసేందుకు కార్యనిర్వహక ఉత్తర్వులను ఉపయోగించుకో వచ్చునని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇప్పటికే మన రాష్ట్రం ఈ మూడంచల విధానంకోసం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.