అమెరికాలోని లాస్ ఎంజెలిస్, కోడక్ థియేటర్‌లో 83వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి.ఈసారి ఆస్కార్‌పై భారత్ ఆశలు గల్లంతయ్యాయి. రెండేళ్ల కిందట దేశానికి మొట్టమొదటి ఆస్కార్ సాధించి పెట్టిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహ్మాన్ ఈ ఏడాది కూడా ఉత్తమ నేపథ్యం సంగీతం, గీతం విభాగాల్లో నామినేషన్ పొందినా చివరకు ఉత్త చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.