28, ఫిబ్రవరి 2011, సోమవారం

నగదు బదిలీ ని కాపీ కొడుతున్న కాంగ్రెస్

గత ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ పొందుపరచిన నగదు బదిలీ పథకాన్ని పథకాలను ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు మార్చి డైరెక్ట్ ట్రాన్స్‌లేషన్ క్యాష్ స్కీముగా అమలు చేయడానికి చర్యలు చేపడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ఎదుర్లంకలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నగదు బదిలీ పథకాన్ని రూపొందించిన చంద్రబాబును కాంగ్రెస్ నేతలు... గ్యాస్, ఎరువులపై అందించే సబ్సిడీని డైరెక్టుగా నగదు రూపంలో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టేుదుకు చర్యలు చేపడుతోంటే.. ఎందుకు మాట్లాడ లేకపోతున్నారని నిలదీశారు.. పేదలకు నేరుగా లబ్ది చేకూర్చగల పథకం నగదు బదిలీ మాత్రమే అని ఇప్పటి కైనా కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలన్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలన్న ఆలోచన తప్ప రాష్ట్రాభివృద్ధికి నిధులు అందించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి, నడిపించగల వాయిస్ స్పీకర్‌కు లేదని.. ప్రతిపక్ష పార్టీ నిలదీస్తుందనే భయంతోనే సమస్యలు చర్చకు రానివ్వడం లేదని యనమల ఆరోపించారు. రైతాంగం సమస్యలపై చర్చిద్దామంటే అసలు టీడీపీకి అవ కాశం ఇవ్వకుండా అసెంబ్లీని వాయిదా వేస్తున్నారన్నారు.