ఐ హేట్ బాలయ్య అనే వెబ్‌సైట్‌పై తెలుగు సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదు నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు కావాలనే వెబ్ఃసైట్ఃలో తనపై వ్య0గ్యంతోకూడి వ్యాఖ్యలు పెడుతున్నారని, ఎస్ఎంఎస్లు పంపుతున్నారని బాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐటి, ఐపిసిల కింద కేసు నమోదు చేశారు.
రాజకీయంగా, సామాజికంగా, వృత్తిపరంగా తనను దెబ్బ తీసేందుకు వెబ్‌సైట్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని..వైబ్‌సైట్ తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్న తనపై కొందరు కావాలనే తన ఇమీజ్ దెబ్బతీసేవిధంగా..బురద జల్లుతున్నారని... తన కుటుంబం, తన అభిమానుల మనస్సుని నొప్పించేవిధంగా కొందరు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని బాలకృష్ణ ఆరోపించారు. వెబ్‌సైట్‌లో అసత్యప్రచారం సాగిస్తున్నారని, మెసేజ్‌లు తన అభిమానులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఈ వెబ్‌సైట్ తనను మానసిక వేదనకు గురి చేస్తోందని ఆయన అన్నారు.