రేపు రైళ్లు నడవవు...
తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు 'రైల్‌రోకో' నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల ప్రయాణాలకు వాయిదా వేసుకోవలసిందిగా అధికారులు ప్రయాణికులకు సూచించారు. అలాగే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావలసిన గరీభ్‌రథ్ రైలును కూడా రద్దు పరిచారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలపు కూడా రద్దు పరుస్తున్నట్లు తెలిపారు.