రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్‌గా మారిపోవాలంటే పోలవరం ప్రోజక్టు తప్పని సరిగా పూర్తి కావాలని మహా నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలు కన్నారని... దానిని సాకారం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు మాజీ కడప ఎంపి వైఎస్ జగన్. సోమవారం రావుల పాలెం నుండి తన హరిత యాత్రని ప్రారంభిస్తూ... పోలవరం వల్ల కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం జరిగి తెలంగాణా, కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు బాగు పడతాయని... ఈ ప్రోజక్టు పూర్తి కాక పోతే రాష్టంలో అనేక జిల్లాలు ఎడారిగా మారిపోయే అవకాశముందని ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు గ్రహించి కేంద్రంపై వత్తిడి తెచ్చి జాతీయ ప్రోజక్టుగా నిధుల రప్పించేందుకు యత్నించాలని... కృష్ణా ట్రిబ్యునల్ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం సాధనకే తాను హరితయాత్రను చేపట్టానన్నారు.
తనతో పాటుగా పోలవరం సాధించేందుకు లక్షలాది రైతులు పాదయాత్ర చేసేందుకు సిద్దంగా ఉన్నారని... పోలవరంతో పాటు చేవెళ్ల, ప్రాణహితని కూడా పూరిత చేయాల్సిన అవసరముందని.. రైతుల ఆశలు ప్రభుత్వాలు తీర్చక పోతే నాశనమైపోతాయని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు వ్యాఖ్యానించారు జగన్.