7, ఫిబ్రవరి 2011, సోమవారం

విలీనానికి ఇక తెరాసనే తరువాయి : దేశం

హైదరాబాద్‌ : రాష్ట్త్ర రాజకీయాల్లో మరోమారు కాంగ్రెస్‌ శాసనసభ్యుల కొనుగోళ్లకు తెరలేపిందని... తరువాత అస్త్రం తెరాసపైనేనని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. సోమవారం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ మీడియాలో మాట్లాడుతూ... కాంగ్రెస్‌, ప్రజారాజ్యం పార్టీల విలీనం చారిత్రాత్మకం అని చిరంజీవి, మొయిలీ చెప్పుకుంటున్నారని... అయితే దీని వెనుక చారిత్రిక ఒప్పందాలు కూడా బైటకు చెప్పాలని డిమాండ్‌ చేసారు.

కాంగ్రెస్‌ పార్టీతోనే పోరాటానికి సిద్దమని చెప్పిన చిరంజీవి తన శక్తి చాలట్లేదని.. అందుకే కాంగ్రెస్‌తో కలిసానని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారాయన. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను హోల్‌ సేల్‌ ధరలో అమ్మేందుకు బేరం కదుర్చుకున్న చిరంజీవిని కాదని ఇద్దరు ఇప్పటికే జగన్‌ వెంట నడిచారని... ఇక తరువాత అస్త్రం తెరాసపైనేనని కాంగ్రెస్‌ నేతలు ప్రకటనలు చేస్తున్నారని... జగన్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినా 2014 నాటికి జగన్‌ని కూడా కాంగ్రెస్‌ పంచన చేర్చేందుకు ఇప్పటినుండే కొందరు ప్రయత్నిస్తున్నామని చెపున్న విషయం గమనించాలని అన్నారు.