కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడటం వల్ల కొంత నష్టం జరిగిందని, అయితే చిరంజీవి కలవడం వలన కాంగ్రెస్ ఎంతో లాభం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
సోమవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం పట్ల కొంతమంది కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని ... విలీనం కావటం వల్ల రెండు పార్టీలకు లాభమని..పార్టీలో అందరినీ కలుపుకొని వెళుతామని చెప్పారు ప్రజారాజ్యం పార్టీకి రాష్టంలో వచ్చిన 18 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయింపు అవుతాయని బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు.