పోలవరం పొడవు చెపితే సిఎం సీటు ఇస్తామంటూ రాష్ట్ర మంత్రి డి.ఎల్ రవీంద్రారెడ్డి చేసిన వాఖ్యలపై జగన్ వర్గం ధీటుగా స్పందించింది. సోమవారం జగన్ హరిత యాత్రలో పాల్గొన్న అంబటి రాంబాబు పాత్రికేయులతో మాటాడుతూ... మంత్రి డిఎల్ ఇనాళ్లు వైఎస్‌ని విమర్శించి పదవిలోకి వచ్చాడని... ఇంకా ఏదో సాధించుకోవాలనే ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌ని విమర్శించడం ప్రారంభించాడని... ఇలాంటి చచ్చు, పుచ్చు మాటలకు జనం ఎవ్వరూ పడిపోరన్న విషయాన్ని గుర్తెరగాలని విమర్శించారు. సరిగా తెలుగురాని వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నిలపడం తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం... కిరణ్ కుమార్ రెడ్డికి ధైర్యముంటే వందేమాతరం, జగనణమన గీతాలు అక్షరం పొల్లు పోకుండా పాడాలని సవాల్ విసిరారు.
మరోవైపు నిన్న తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తు వైఎస్ హయాం అంతా అవినీతి మయం అని చిరంజీవి విమర్శిస్తున్నా... నాటి వైఎస్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు ఎవ్వరూ స్పందించకపోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. చిరంజీవితో క్షమాపణలు చెప్పిసారో? లేక తమ పదవులకు రాజీనామాలు సమర్పించి వైఎస్ పట్ల గౌరవాన్ని చాటుకుంటారో వారే నిర్ణయించుకోవాలని డిమాండ్ చేసారు అంబటి.