హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటమన్నది ఆరెండు పార్టీలకు సంబంధించిన వ్యవహరమని... అంత మాత్రాన తెలంగాణా రాష్ట సమితిని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్దమవుతున్నట్టు వసున్న కధనాలను తెరాస శాసనసభుడు హరీష్‌రావు కొట్టిపారేసారు.
తెలంగాణా రాష్ట ఏరాటే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన తెరాస లక్ష్య సాధన నుండి కించత్ కూడా వెనకడుగు వేసే ప్రశ్న తలెత్తదని స్పష్టం చేసారు. తెరాస కూడా కాంగ్రెస్‌లో విలీనం అయ్యే సూచనలున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావుతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు చేసున్న ప్రకటనలు కేవలం ప్రజల్ని అయోమయంకి గురి చేయటానికేనని.. అలాంటి ప్రశ్న భవిష్యత్‌లో కూడా తలెత్తబోదని వ్యాఖానించారు హరీష్‌రావు.