పెద్దల ఆశీస్సుల కోసం హస్తినలొ ‘చిరు”బిజీ.. బిజీ...
న్యూఢిల్లీ : నిన్ననే పీఆర్పీ పార్టీకి మంగళం పాడేసి... నేటి నుండి కాంగ్రెస్ నేతగా మారిపోయిన చిరంజీవి ఇక ఢిల్లీ పెద్దల ఆశీస్సులకోసం బిజీ అయిపోయారు. ఈమేరకు ఆయన సాయంత్రం 4.30 గంటకు కేంద్ర పెట్రోలియం మంత్రి ఎస్. జైపాల్ రెడ్డిని కలుస్తుండగా... రాత్రి 8.30కి కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణాబ్ ముఖర్జి తదితరులను కలుస్తారు. మరో రెండు రోజుల పాటు హస్తినలోనే ఉండి అందరీన కల్సి రావాలన్న అభిలాషలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది.