ఈమధ్య ప్రపంచ వ్యాప్తంగా ప్రజా నేతలని చెప్పుకునే వారివి మీద చెప్పులు విసిరి సత్కరించే సంస్కృతి పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌పై కూడా చెప్పు సత్కారం జరిగింది. సోమవారం ఆయన లండన్‌లో ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు చెప్పు విసిరి సత్కరించబోయాడు. అయితే అందరిలాగానే ముషారఫ్ కూడా ఈ సత్కారాన్ని అనూహ్యంగా తప్పించుకోవడం విశేషం.
సదరు చెప్పు విసిరి వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు తనదైన శైలిలో వివిచారణ చేపట్టారు. ఇప్పటికే ఇలా చెప్పును విసిరేయించుకున్న వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్, మన ప్రస్తుత కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.