7, ఫిబ్రవరి 2011, సోమవారం

ఆ పని చేస్తే... కేసీఆర్‌ కూడా విలీనానికి రడీ....

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ ఈ క్షణంలో తెలంగాణా ప్రకటించి ఆ ప్రక్రియను ప్రారంభిస్తే తెలంగాణా రాష్ట్రసమితిని కేసీఆర్‌ విలీనం చేయటానికి సిద్దంగా ఉన్నారని నిజమాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుయాష్కీ ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ... కాంగ్రెస్‌లో కలిసేందుకు కేసీఆర్‌ ఇప్పటికే తన వైఖరి సుస్పష్టంగా ప్రకటించారని... అది తెలంగాణా రాష్ట్రం మాత్రమేనని అన్నారు.

ప్రజారాజ్యంని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయటం వల్ల తెలంగాణాలో కన్నా సీమాంధ్ర ప్రాంతంలోనే తమ పార్టీ ప్రయోజనాలు ఎక్కువగా పొందుతుందన్నారు.ఇక మున్ముందు కాంగ్రెస్‌ నేతగా అధిష్టానం నిర్ణయాలకు చిరంజీవి బద్దుడై వ్యవహరిస్తారన్న నమ్మకం తమకుందని... ఆయనతో కల్సి పనిచేయటానికి ఎలాంటి అభ్యంతరం లేదని యాష్కీస్పష్టం చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉందని ... తెలంగాణాపై త్వరిత గతిన కేంద్రం నిర్ణయం ప్రకటించాలని తాను మొయిలీని కోరినట్లు చెప్పారాయన