కేసీఆర్ తెరాస లోని అసంతృప్త లోససి తో పాటు అన్ని పార్టీలలోని అసంతృప్త తెలంగాణా నేతలంతా కల్సి ఓ పార్టీని పెట్టుకునేందుకు సిద్దమైపోతు… అందుకు అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలరు రడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణా లో తనదే పేటెంట్ అనే రీతిలో వ్యవహరిస్తూ…తెలంగాణా అంశాన్ని గాలికొదిలేసి ఇతర పార్టీల నేత ల్ని తెరాస వైపు మళ్లించి రానున్న ఎన్నికల నాటికి బలంగా రూపాంతరం చేసేందుకు చూపుతున్న శ్రద్దలో ఇసుమంత కూడా తెలంగాణా కోసం ఢిల్లీలో యత్నాలు చేయని కేసీఆర్ వైఖరిపై విసిగేసిన నేతలకు ఈ మధ్య సోనియాని విమర్శించి పార్టీని పొమ్మని పొలికేక పెట్టిన కాకా నాయకత్వం తోడు కావటంతో వీరంతా తెలుగుదేశం పార్టీలో ఉన్న అసంతృప్తులైన కడియం, నాగం, ఎర్రబిల్లి తదితరుల్ని కలుపుకు పోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.
కేసీఆర్‌ని దెబ్బ కొట్టాలంటే అందుకు తెరాసలో అసంతృప్త నేతగా ఉన్న హరీష్‌రావుని దువ్వటంమే ప్రధానంగా భావించిన ఈ నేతలు ప్రస్తుతం ఆపనిలో ఉన్నారని, హరీష్ కూడా వీరి ప్రయత్నాలను అభినందిస్తూ.. అవసరమైతే తెరాసను వీడి వచ్చి పని చేసేందుకు సిద్దమేనని హామీ ఇవ్వటం జరిగిందని కధనాలొస్తుండటంతో…మరి కొద్ది రోజుల్లో ఈ ‘అసంతృప్త తెలంగాణా’ పార్టీ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకుల భావన.